వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ మరోవైపు కుర్రహీరోలతో తెరను పంచుకుంటూ దశాబ్దాల అనంతరం తెలుగులో మల్టీస్టారర్ సంప్రదాయానికి తెర తీసిన వెంకటేశ్ మరోసారి మల్టీస్టారర్‌పై ఆసక్తి వ్యక్తపరిచాడు. “ఈ ఏడాది వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2′ .. నాగచైతన్య తో కలిసి ‘వెంకీమామ‘ చేసే అవకాశం వచ్చింది. మిగతా యువ హీరోలతోను కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలనుంది.ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్ ను .. డాన్సింగ్ స్టైల్ ను నేను బాగా ఇష్టపడతాను. మంచి కథ కుదిరితే ఆయనతో కలిసి నటించాలనుంది. ‘వెంకీమామ‘ తరువాత ప్రాజెక్టుగా ‘అసురన్‘ రీమేక్ ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.వెబ్‌సిరీస్‌లలో సైతం నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెంకీ మనసులోమాట బయటపెట్టాడు..