తిరుపతి:ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వేద పండితులు వారికి స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించిన వారిలో చంద్ర బాబు నాయుడుతో బాటు ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మిణి, మనవడు దేవాన్ష్, కొందరు మంత్రులు ఉన్నారు. సుజనా చౌదరి వినతి ప్రకారం ఆయన అనూయాయుల్నికూడా ఆలయ ప్రవేశానికి అనుమతించారు.