రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటానికి పాలు పోసి రవితేజ అనే వ్యక్తి నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో రమేష్ బాబుపై స్వతంత్ర్య అభ్యర్థిగా రవితేజ పోటీ చేశారు. కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేసి జర్మనీలో ఉంటూ రమేష్ బాబు టెలీ పాలన చేస్తున్నారని ఆరోపించారు.