గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్ కన్నుమూత

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్ కన్నుమూత

బెంగళూరు: తమిళనాడులో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణిం చినట్లు భారత వాయుసేన ప్రకటించింది. డిసెంబర్ 8న తమిళనాడు కూనూర్ సమీపంలోప్రమాదం సంభవించింది. 13 మంది ఆ రోజు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్కు తొలుత వెల్లింగ్టన్ లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స చేసారు. ఆ తర్వాత ఇక్కడకు తరలించారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం కన్నుమూశారు. వరుణ్ సింగ్ మృతికి వాయుసేన సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. వరుణ్ సింగ్ తండ్రి.. ఏఏడీ (ఆర్మీ ఎయిర్ డిఫెన్స్)లో విధులు నిర్వహించారు. వరుణ్ సోదరుడు తనూజ్ ప్రస్తుతం నావికా దళంలో లెఫ్టినెంట్ కమాండర్. గతేడాది అక్టోబర్లో.. ఆయన నడుపు తున్న తేజస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సమయస్ఫూర్తితో విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos