వర్మ ఓవర్‌ యాక్షన్‌…పోలీసుల జరిమానా

  • In Crime
  • July 20, 2019
  • 184 Views
వర్మ ఓవర్‌ యాక్షన్‌…పోలీసుల జరిమానా

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ను వీక్షించేందుకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి బైక్‌పై వెళ్లారు. ట్రిపుల్ రైడింగ్, పైగా హెల్మెట్ లేకుండా బయల్దేరారు. అంతటితో ఆగితే ఆయన వర్మ ఎలా అవుతారు? ‘ఇస్మార్ట్ శంకర్ చూసేందుకు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌లో  వెళుతున్నాం. ఇంతకీ పోలీస్ ఎక్కడ?’ అంటూ ట్వీటారు. బహుశా వాళ్లూ థియేటర్లో ఉండి ఉంటారు అంటూ వ్యంగ్యంగా ఓ కామెంట్ కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మరి తామేమైనా తక్కువ తిన్నామా అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. బైక్‌పై  ముగ్గురున్నందుకు రూ.1200, హెల్మెట్ లేని ప్రయాణానికి రూ.100తో పాటు యూజర్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.1335 వడ్డించారు. పైగా రామ్‌గోపాల్‌ వర్మ పోస్ట్ చేసిన చిత్రాన్ని ఈ-చలానా వెబ్‌సైట్‌లో ఉంచడం గమనార్హం. ఈ బైక్ దిలీప్ కుమార్ పేరిట ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos