జగన్‌ అవినీతిపై ఫిర్యాదు

జగన్‌ అవినీతిపై ఫిర్యాదు

విజయవాడ : అవినీతి గురించి ప్రభు త్వం దృష్టికీ తీసుకెళ్లేందుకు ఆరంభించిన 14400 నెంబరు సహాయ వాణికి తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళవారం ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రి జగన్ అక్రమార్జన దర్యాప్తు చేయాలని కోరారు. తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రూ. వేల కోట్లు ఆర్జించారని వివరించారు. జగన్ రాజకీయ అవినీతి పైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే కళా వెంక ట్రావ్ లేఖ రాశారని గుర్తు చేశారు. ఫిర్యాదును సచివాలయానికి తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది వర్ల రామయ్యకు సూచించింది. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తనకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై 15 రోజుల్లో చర్యలు తీసు కో వాలని డిమాండు చేసారు. రూ.43 వేల కోట్ల అక్రమాస్తులున్నట్లు అభియోగాల్ని ఎదిరిస్తున్న జగన్ అవినీతిని ఎలా అంత మొందిస్తారని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos