ముంబై : విప్లవ కవి వరవర రావు (82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలైన వరవర రావు భార్యతో కలిసి ముంబైలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. బెయిలును పొడిగించడంతోపాటు స్వస్థలం హైదరాబాద్లో ఉండేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టుకు విన్నవించారు. మెదడు, కళ్ల సమ స్య లకు జైలులో తగిన చికిత్స అందుబాటులో లేదని వరవరరావు వివరించారు. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినట్టు అనుమానం ఉందన్నారు. సమయం మించిపోవడంతో ఈ పిటిషన్ను పూర్తిగా విచారించలేకపోయిన ధర్మాసనం వరవర రావుకు కాస్త ఊరట నిచ్చింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని ఎన్ఐఏను ఆదేశించింది. అక్టోబరు 14 వరకు తోలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.