హైదరాబాద్ : రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆయన విషయంలో ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపడం లేదని విమర్శించారు. రాజకీయ ఖైదీల కోసం త్వరలో లక్ష సంతకాల సేకరణ చేపడతామన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయనను అధికారులు జెజె ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వరవరరావును వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య హేమలత, కుమార్తెలు మహరాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు.