వాన్ పిక్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

వాన్ పిక్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాదు:ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వాన్ పిక్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో వాన్ పిక్ ప్రాజెక్టు పేరు కూడా ఉంది. దీనిపై వాన్ పిక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ ఛార్జ్ షీట్ నుంచి తమ ప్రాజెక్టు పేరును తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది.2022 జులైలో ఈ పిటిషన్ ను హైకోర్టు అనుమతిస్తూ సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వాన్ పిక్ పిటిషన్ ను మరోసారి పరిశీలించాలంటూ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ సూచనల మేరకు తాజాగా మంగళవారం సదరు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. వాన్ పిక్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ పిటిషన్ ను కొట్టివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos