హైదరా బాదు:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్కు వ్యతిరేకంగా వ్యాసాల్ని రాసిన ప్రధాన పౌర సంబంధాల అధికారిని వెంటనే పదవి నుంచి తొలగించక పోతే ఆయనకు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేస్తామని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును డిమాండు చేసారు. గవర్నరుగా ప్రమానాన్ని చేసి 24 గంటలూ ముగియక ముందే కేసీఆర్, తన కను సన్న ల్లో ఆమెను కించ పరిచే వ్యాసాలు రాయించారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిని అవమానించార న్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయిం చినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు.