అమరావతి:చిత్తూరు జిల్లా మినహాయించి రాయలసీమలో గురువారం భారీ వర్షాలు మూడ్రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ గురు వారం ఇక్కడ తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణాజిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ తెలిపింది. ప్రజలు వాగులు, వంకలు దాటే సాహసం చేయ రాదని వాతావరణ నిపుణులు సూచించారు.