ఈనెల 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వాల్మీకి చిత్ర బృందం విడుదల చేసిన పాట మేకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.80వ దశకంలో ఒక ఊపు ఊపిన శ్రీదేవి, శోభన్ బాబు ఐకానిక్ సాంగ్ ‘ వెల్లువొచ్చి గోదారమ్మ’ ని రీమిక్స్ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో ఉంది.పాత పాటను చిత్రీకరించిన లొకేషన్లోనే అదే కాస్ట్యూమ్స్ అదే బిందెలతో చిత్రీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది..