కృష్ణ జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో జిల్లా రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు, వంశీల మధ్య మెసేజ్ లు, లేఖలు కూడా నడిచాయి.చంద్రబాబుతో పాటు తెదేపా సీనియర్ నేతలు సైతం వంశీని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.వైసీపీ మంత్రులతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కూడా వంశీ చర్చలు జరపడంతో ఏ పార్టీలో చేరనున్నారనే సందిగ్ధత నెలకొంది.ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు వంశీ స్వయంగా చెక్ పెట్టారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు వంశీ ప్రకటించారు.నవంబర్ 3న కానీ లేదా 4న కానీ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.