విజయవాడ: ‘నాపై తెదేపా వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో నా పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తున్నార’ని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఎన్ విజన్, రాయలసీమ ప్రైడ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్లు మూతపడ్డాయి. వాటి అడ్మిన్లు ఇంటర్నెట్ నుంచి సైట్లను తొలగించారని వల్లభనేని వంశీ ఫేస్ బుక్ లో వెల్లడించారు. సంబంధిత స్క్రోలింగ్ ఒక వార్తా చానల్లో కూడా వచ్చింది.