పుష్కరాల ‘పాపాల’ పై మళ్లీ విచారణ

అమరావతి : గోదావరి పుష్కరాల తొక్కిసలాట గురించి మంత్రి వర్గ ఉప సంఘంతో విచారణ జరిపించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం శాసన సభలో వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెదేపా పరిపాలనలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంతోనే గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై మళ్లీ విచారణ జరిపించదలచినట్లు విపులీకరించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి కారణమెవరని సభ్యుడు జోగి రమేశ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అక్కడ జరిగిన సినిమా షూటింగే తొక్కిసలాటకు కారణమని మండి పడ్డారు. ‘పుష్కరాల్లో రూ. వేల కోట్ల దోపిడీ జరిగింది. అది కుంభమేళా కాదు.. అతి పెద్ద కుంభకోణం’ అని ఎద్దేవా చేశారు. ముహూర్తానికి స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందన్న ప్రచారంతోనే ఆ అవాంఛనీయం సంభవించిందని మరో వైకాపా సభ్యుడు మల్లాది విష్ణు తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos