ఢిల్లీ : లండన్‌లో ఉన్న స్థిరాస్తి కొనుగోలులో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఈడీ ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్‌ను ఈ నెల 25 వరకు పొడిగించింది. గత బెయిల్ గడువు మంగళవారంతో ముగియనుండగా, ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. మరో రెండు ఇళ్ల కొనుగోలులోనూ వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, కనుక అతనిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీకి సహకరించాలని కోర్టు వాద్రాకు సూచించింది.