న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా
గాంధీ ముఖ్య అనుచరుడు, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి టామ్ వడక్కన్ గురువారం. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భాజపా
తీర్థాన్ని పుచ్చుకున్నారు. ‘కురువృద్ధ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ ప్రస్తుతం నాయకులను వాడుకుని వదిలివేసే స్థాయికి దిగజారిందన్నాది.
వంశ పారంపార్య పార్టీలో ఇతర నాయకులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బతకాల్సి ఉంది’అని వడక్కన్ ఈ సందర్భంగా హస్తం నేతలపై విరుచుకు పడ్డారు. ‘పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై
మెరుపు దాడులకు దిగితే అందుకు సాక్ష్యాలు కావాలంటూ.. సైనికులను అవమానించే తీరుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. భారత సైన్యం విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. అందుకే కాంగ్రెస్‌ను వీడినట్లు’
వివరించారు. ‘జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే కాంగ్రెస్‌లో కొనసాగ
లేక పోయా. దేశ ప్రేమతోనే భాజపాలో
చేరాను. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద దార్శనికుడు. ఆయన నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది’ అని
మోదీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.