ఢిల్లీ : కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన టామ్ వడక్కమ్పై ఇంటర్నెట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు బీజేపీపై దుమ్మెత్తి పోసిన ఆయన ఉన్నట్లుండి కమల దళంలో చేరడంతో నెటిజెన్లు ఆయన పాత ప్రకటనలను గుర్తు చేస్తూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కేరళకు చెందిన ఆయన బీజేపీలో చేరడంతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. గత నెలలో కాంగ్రెస్ నాయకుడొకరు బీజేపీలో చేరినప్పుడు వడక్కమ్ చేసిన ట్వీట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. ఫిబ్రవరి నాలుగున ఆయన…మీరు బీజేపీలో చేరితే మీ నేరాలన్నీ చెరిగిపోతాయి…అని ట్వీట్ చేశారు. దీనిని గుర్తు చేస్తూ నెటిజెన్లు ప్రస్తుతం ఆయనను ఆట పట్టిస్తున్నారు. బీజేపీ మాత్రం వడక్కమ్ తమ పార్టీలో చేరికపై చంకలు గుద్దుకొంటోంది.