న్యూ ఢిల్లీ: కరోనా టీకాల్ని దేశ ప్రజలకు ఉచితంగా వేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కరోనా టీకాల్ని వేయించుకునేందుకు ఇప్పటి వరకూ 70,33,338 మంది పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.