సాయుధ బలగాల్లో లక్ష ఖాళీలు

సాయుధ బలగాల్లో లక్ష  ఖాళీలు

న్యూ ఢిల్లీ: బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లోక్సభ సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాత పూర్వకంగా తెలిపారు. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలు. అత్యధికంగా బీఎస్ఎఫ్లో 28,926 ఖాళీలు ఉన్నాయి. సీఆర్పీఎఫ్లో 26,506, సీఐఎస్ఎఫ్లో 23,906, ఎస్ఎస్బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఖాళీల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos