చంద్రబాబు ఆహ్వానిస్తే తెదేపా తరపున ప్రచారం చేస్తా..

చంద్రబాబు ఆహ్వానిస్తే తెదేపా తరపున ప్రచారం చేస్తా..

తెలంగాణ రాష్ట్ర
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కావడం
లేదు.తాజాగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా తరపున
ప్రచారం చేస్తానంటూ ప్రకటించారు.పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘంపై కూడా హనుమంతరావు
ఆరోపణలు చేశారు.ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదంటూ విమర్శించారు.శాసనసభ ఎన్నికల
సమయంలో తమ పరిధిలోకి లేని నిఘా అధికారిని బదిలీ చేయడం ఏంటంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.తెలంగాణ
లోక్‌సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత
వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయంటూ ఆరోపించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్రానికి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారని
ఆరోపించిన వీహెచ్‌ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇక ఎప్పటికీ
కోలుకోలేదన్నారు.కాగా చంద్రబాబుపై వీహెచ్‌కు హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో
అర్థక కాక కాంగ్రెస్‌ నేతలు సైతం తలలు బాదుకుంటున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos