న్యూ ఢిల్లీ:ఉత్తరకాశీ, ధరాలీలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న పౌరులను కాపాడేందుకు కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. సైన్యం, ఐటీబీపీ, బలగాలను కేంద్ర మోహరించగా దెహ్రాదూన్‌లో ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 130మందిని కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించగా, మరో 60 నుంచి 70 మంది బురద, శిథిలాల కింద ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. పది మంది జవాన్లు కూడా గల్లంతుకావడం ఆందోళన రేకెత్తిస్తోంది.