హైదరాబాదు: డాక్టర్లకు తగినన్ని పీపీఈ కిట్లు ఇవ్వడం, ప్రజలకు సరిపడా కరోనా టెస్టులు చేయించడం కన్నా సచివాలయం భవనాలు కూల్చేయడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ట్విట్టర్లో దుయ్యబట్టారు. ‘సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింద’ని ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోనూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్కి ప్రజల బాధల కంటే తన పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని విమర్శించారు.