ముంబై : స్టాక్ మార్కెట్ల వ్యాపారం గురువారం మందకొడిగా మొదల య్యాయి. ఉదయం సుమారు 9.40 గంటల వేళకు సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 38,629 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 11,460 వద్ద నమోదయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్బ్యాంక్లు లాభాల్ని గడిం చాయి. వేదాంతా, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు నష్ట పోయాయి. నిఫ్టీ సూచీల్లో బ్యాంక్ లాభపడగా, లోహ రంగం నష్ట పోయింది. బుధవారం అమెరికా మార్కెట్లు కుంగాయి. దీని ప్రభావం మన స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఆసియా మార్కెట్లు కూడా నష్ట పోయాయి.