వాషింగ్టన్: ‘పౌరసత్వ చట్టాన్ని సవరించినందుకు అమెరికా ఆందోళన వ్యక్తీకరించింది. సవరణ వల్ల భారత్లోని అల్పసంఖ్యాకుల హక్కులకు విఘాతం కలగదని కేంద్ర ప్రభుత్వం చేసిన స్పష్టీకరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల ప్రకారం దేశంలోని మైనారిటీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని హితవు పలికింది. చట్ట సవరణ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తిన అశాంతి పిరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మత స్వేచ్ఛ, సమానత్వం రెండు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా ఉన్నాయని గుర్తు చేశారు.