ఇండియా నుంచి అందరూ తక్షణమే వచ్చేయండి

ఇండియా నుంచి అందరూ తక్షణమే వచ్చేయండి

వాషింగ్టన్:ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. లెవెల్-4 ట్రావెల్ అడ్వైజరీ కింద ఈ హెచ్చరికలు జారీ చేసింది. ‘ఇండియాకు ఎవరూ వెళ్లవద్దు. అక్కడున్న వారు త్వరగా తిరిగి రావాలి. భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితం. ఇండియా నుంచి అమెరికాకు నేరుగా వచ్చేందుకు ప్రతి రోజు 14 విమానాలు ఉన్నాయి. ఐరోపా గుండా మరిన్ని విమాన సర్వీసులు ఉన్నాయ’ని వివరించింది. ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులను ఇంగ్లండ్ ఒక హోటల్ లో క్వారంటైన్ చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos