వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను భారత్‌పై పడింది. దెబ్బకు దెబ్బ అన్న చందాన భారత్ దిగుమతులపై భారీ సుంకాలు విధించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి చేస్తున్న సరుకులపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆ దేశం గుర్రుగా ఉంది. అదే విధంగా తాము భారత్ దిగుమతులపై ఇన్నాళ్లూ ఇస్తున్న మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా ఆలోచిస్తోందని సమాచారం. ఇదే కనుక జరిగే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సుమారు 560 కోట్ల డాలర్ల సరుకులపై భారీగా పన్నులు పడే అవకాశం ఉంది. వ్యాపార పరంగా భారత్‌కు ఇది గట్టి దెబ్బే.