ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల జమ్ము-కశ్మీర్లో జన జీవనం అస్తవ్యస్తమైందని బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు కారణంగా అక్కడ నెలకొన్న పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్ము-కశ్మీర్లో ఉన్న తన అత్తమామలతో 22 రోజుల ముందు మాట్లాడామని, తర్వాత వారి గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారు మధుమేహం, రక్తపోటుతో బాధ పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు వారి వద్ద మందులు ఉన్నాయో, లేదో కూడా తెలియడం లేదన్నారు. తాను కానీ, తన భర్త కానీ వారితో మాట్లాడలేకపోయామని వాపోయారు.