ముంబై: ఒకప్పటి హిందీ సినీ నటి ఊర్మిల మతోండ్కర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఆరు నెలల కిందటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ముంబై ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ‘సమున్నత లక్ష్యం కోసం కాంగ్రెస్ పార్టీలో తాను పనిచేయాలనుకున్నాను. అంతర్గత రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడటం నాకు కు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే నేను పార్టీకి రాజీనామా చేసాను. సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓటమి చెందినా పార్టీ తరఫున పోరాడాను. ఆత్మసాక్షిగా, ఎంతో గౌరవంతో ఎన్నికల్లో శ్రమించాను. రాజకీయాల్లో ఎంతో నేర్చుకున్నాను. రాజకీయాల్ని వదిలి ఎక్కడికీ వెళ్లబోన’ని ఊర్మిళ విశదీకరించారు.