ముంబై: అత్యాచారుల్ని ఉరి తీయటం అత్యాచారాల సమస్యను పరిష్కరించజాలదని సినీ నటి తనుశ్రీ దత్తా బుధవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. నిర్భయ హత్యాచారులు- ముఖేశ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్(31)ని జనవరి 22 ఉదయం ఏడు గంటలకు తిహార్ జైలులో చనిపోయే వరకూ ఉరి న్యాయస్థానం జారీ చేసింది. దీనిపై సినీ నటి తనుశ్రీ దత్తా స్పందించారు. ‘ఎంతమందిని ఉరితీస్తారు? నేను ఈ సమస్య పరిష్కారం కోసం చూస్తున్నా. చంపడం సమస్యకు పరిష్కారం కాదు. సమస్య అంతం కాబోద’ని అభిప్రాయపడ్డారు.