బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నారు గాని యూరియా కొరతతో మొక్కజొన్న, వరి నాటిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతుల తెలిపారు. చాలీచాలని యూరియా వస్తుండడంతో కనీసం రైతులకు తెలిసే లోపల అయిపోవడం ఎటువంటి సమాచారం కానీ మండల ఏవో తెలపకపోవడంతో రైతులకు కందులు వచ్చిన విషయం కూడా తెలియదని పలువురు రైతులు తెలిపారు. యూరియా విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఉన్నతాధికారుల సైతం కొరత లేదని తెలపడం ఆశపరంగా ఉందని పలువు రైతులు తెలిపారు.