హైదరాబాద్ : పౌరసత్వ చట్టాన్ని సవరించినందుకు నిరసనగా పద్మశ్రీ పురస్కారాన్ని వాపసు చేయనున్నట్లు ప్రముఖ ఉర్దూ రచ యిత ముజ్తబా హుసేన్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ‘గంగా జమున తేహజీబ్ సంస్కృతి అమలులో ఉన్న మన దేశం లో రోజు రోజుకు పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి.దేశంలో మతం పేరిట విభజిస్తున్నారు. ఇలాంటి చర్యలకు నిర సన గా నేను పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి కేంద్రానికి వాపసు చేస్తున్నాన’ ని ముజ్తబా హుసేన్ ప్రకటించారు.