లఖ్నవు :ఉత్తరప్రదేశ్ కు గత 5 రోజుల్లో నాలుగు లక్షల మంది వలస కార్మికులు, కూలీలు శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో చేరుకున్నారు. సోమవారం ఒక్క రోజే లక్ష మంది చేరుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరిన్ని లక్షల మంది వస్తారని అధికార్లు చెప్పారు. వీరంతా క్వారంటైన్ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వారిలో ఇప్పటికే పలువురిలో కరోనా లక్షణాలను గుర్తించామని చెప్పారు. సామాజిక నిఘా యే సరైన పరిష్కారమన్నారు.