సైనిక సంయమనం పాటించాలి

సైనిక సంయమనం పాటించాలి

ఐక్యరాజ్యసమితి: భారత్-పాకిస్తాన్ సైనిక సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని గుటెర్రెస్ ఒక ప్రకటనలో తెలిపినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. “నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక చర్యల గురించి యుఎన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. రెండు దేశాలు సైనిక సంయమనం పాటించాలి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదు” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos