న్యూ ఢిల్లీ: అమెరికాలో సెప్టెంబర్ 9 నుంచి జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించనున్నట్లు తాజా సమాచారం తొలుత బ్రెజిల్ చర్చను ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 23 న డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని గతంలో ప్రకటించారు. అదే రోజున ఇజ్రాయిల్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నేతలూ ప్రసంగిస్తారు.