హైదరాబాద్: నీతి ఆయోగ్ సూచనతోనే దేశ వ్యాప్తంగా కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, కంపెనీల పనితీరుపై ఎప్పటికప్పుడు కేంద్రం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ఏ కంపెనీ ప్రజలకు ఉపయోగపడుతుందో పరిశీలిస్తుందని.. అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామన్నది కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేజేషన్ ద్వారా ఉద్యోగులకు, కంపెనీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగం ఉందన్నారు.