హైదరాబాద్: కార్మిక సంఘాలకు వెంటనే ఎన్నికల్ని జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాం డు చేసారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. సంఘాల నేతలూ విధులకు హాజరు కావాలని ఆదేశించ టం చౌక బారు చర్యని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించాలని కార్మిక శాఖ కమిషనర్ను కోరారు. ‘కేవలం హక్కుల కోసమే సంఘా లు లేవు. ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వ హిం చాల’ ని డిమాండ్ చేశారు. ‘ఆర్టీసీలో చరిత్రలో ఇది ఓ చారిత్రక సమ్మె. కార్మికులకు జీతాలు చెల్లించాలి. ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింప చేయాలి. కార్మికుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుతున్నాము.యూనియన్లు ఉండాలా? లేదా?అన్నది కార్మిక న్యాయస్థానం తేలుస్తుంది. సంఘాల నుంచి తొలగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాం. కార్మికుల అభిప్రాయ సేకరణతో సంఘాలు ఉండాలా? వద్దా? తేల్చండ’న్నారు. కార్మికుల సమస్యలకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశించారు. సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు వెంటనే ఇవ్వాలని ఐకాస కో-కన్వీనర్ రాజిరెడ్డి కోరారు.