మాస్కో : కరోనా రోగులకు చికిత్స చేస్తున్న నర్సుల్లో ఒకరి వస్త్ర ధారణ వేడి వేడి చర్చకు దారి తీసింది. టులా నగరంలోని ఆసుపత్రిలో ఇరవై యేళ్ల నర్సుకు సమ వస్త్రాలతో బాటు పీపీఈ కిట్లను ధరించడం కష్టంగా తోచింది. వీటిని ధరిస్తే భరించలేని ఉక్క పోతని కేవలం లో దుస్తుల పై పీపీఈ కిట్ వేసుకుంది. పీపీఈ కిట్ ఎంతో పారదర్శకంగా ఉన్నా పట్టించుకోకుండా తన సేవల్ని కొనసాగించింది. ఆసుపత్రి యాజమాన్యం కూడా చూసీ చూడనట్టు ఊరుకుంది. కరోనా రోగి ఒకరు ఆమె ఫొటోను సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించారు.అది సంచలనంగా మారి ఆరోగ్య శాఖ కంట్లోకూడా పడింది. ఆమెపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించింది.