ఢిల్లీ : బీజేపీ ఫైర్‌బ్రాండ్, కేంద్ర మంత్రి ఉమా భారతి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ విషయం చెప్పానని ఆమె వెల్లడించారు. రెండేళ్ల పాటు గంగానది తీరంలో గడపాలనుకుంటున్నట్లు ఆమె తన మనసులోని మాటను బయట పెట్టారు. అయితే అవసరాన్ని బట్టి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, రాజకీయాల్లో తన పాత్ర తప్పక ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఇంకా ఎల్కే. అద్వానీ లాంటి బీజేపీ అగ్ర నేతలు కూడా పోటీ చేయడం లేదని సమాచారం.