కీయెవ్‌లో కర్ఫ్యూ సడలించినా బయటకు రాలేని జనం

కీయెవ్‌లో కర్ఫ్యూ సడలించినా బయటకు రాలేని  జనం

కీయెవ్ : నగరంలో ఆదివారం రాత్రి అంతకుముందుతో పోలిస్తే పేలుళ్లు, కాల్పుల తీవ్రత తగ్గింది. యుక్రెయిన్, రష్యా బలగాలకు దాదాపు ప్రతి జిల్లాలలోనూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ‘రెండు రోజులుగా విధించిన కర్ఫ్యూను సోమవారం ఎత్తేశారు. నిత్యావసర దుకాణాలు తెరచుకున్నాయి. భూగర్భ స్థావరాల్లో తలదాచుకున్న జనానికి కాస్త స్వేచ్ఛ లభించింది. కర్ఫ్యూ ఎత్తివేసిన అరగంట తర్వాత వైమానిక దాడి సైరన్లు మోగటంతో బయటకు వచ్చిన జనం మళ్లీ భూగర్భ స్థావరాలకు తిరిగి వెళ్లారు. ‘‘టెలివిజన్లు, ఫోన్ల చుట్టూ జనం గుమిగూడుతున్నారు. బెలారుస్లో రష్యా అణ్వాయుధాలను మోహరించటానికి వీలుకల్పిస్తూ ఆ దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ ఆమోదించిందనే వార్తలు ఇక్కడి ప్రజలకు ఆందోళన కలిగించాయి. లక్ష మందికి పైగా యుక్రేనియన్లు సైన్యంలో చేరటానికి ముందుకొచ్చారని రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ చెప్పారు. యూరప్కు, యుక్రెయిన్కు మధ్య ఇప్పుడు సరిహద్దులేవీ లేవు, ఇది యూరప్, రష్యా యుద్ధమని అభివర్ణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos