ముంబయి: గత ఎన్నికల హామీలపై ప్రజలు సంధించబోయే ప్రశ్నాస్త్రాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శివసేన తన వాణి మరాఠి పత్రిక-సామ్నా సంపాదకీయంలో మిత్ర పక్షం భాజపాను హెచ్చరించింది. కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, రామ మందిర నిర్మా ణాల గురించి ,చేసిన వాగ్దానాల్ని ఈడేర్చలేక పోయిందని తప్పుబట్టింది. ‘మన్ కీ బాత్’ లో తన అభిప్రాయాలను ప్రజలకు విన్నవించిన ప్రధాని మోదీ ఇప్పుడు ప్రజల మన్ కీ బాత్ వినటం అనివార్యమన్నారు. ‘ప్రజల్ని ఎంతో కాలం మోసం చేయలేం, ఓట్ల రూపంలో దీటైన సమాధానాన్ని ఇస్తారని వ్యాఖ్యానించింది. ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నా వాటి వినియోగంపై భాజపా ఎందుకు పట్టుదల ఎందుకని ప్రశ్నించింది. చాలా దేశాల్లో వాటి వినియోగాన్ని నిలిపివేశారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలాన్ని గడిపారని దుయ్య బట్టారు.