మరాఠా రిజర్వేషన్లకు మడమ తిప్పని పోరు

మరాఠా రిజర్వేషన్లకు మడమ తిప్పని పోరు

ముంబై: ‘..మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తాం’అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. బుధవారం ఇక్కడ విలేఖ రులతోమాట్లాడారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించింది. ప్రధానికి రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి చట్టాలు చేసే అధికారం ఉందని, మహారాష్ట్రకు అధికారం లేదని సుప్రీం వ్యాఖ్యానించి మరాఠాల రిజర్వేషను చట్టాన్ని రద్దు చేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం కోసం ప్రధానిని అభ్యర్ధిస్తాం. ఇందు కోసం శంభాజీ రాజేను నియమించాం. ప్రధానితో భేటీకి నుంచి ప్రయత్నిస్తున్నాం. ప్రధాని ఎందుకు సమయాన్ని కేటాయించటం లేదో అర్థం కావడం లేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా పోరాటం ఆపబోం. మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తాం’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos