చెన్నై : మోడీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుబారా చేస్తోందని డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘అభివృద్థి పధంలో నడిచే నూతన భారతదేశాన్ని నిర్మిస్తానని ప్రధాని మోడీ వాగ్దానం చేసారు. అయితే ఇప్పటి వరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ప్రజాధనాన్ని మోడీ ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి… ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనమే నిదర్శనం. తమిళనాడులో మోడీ ప్రజావ్యతిరేక విధానాలను స్టాలిన్ ఒక్కరే ఎండగడుతున్నారు. అన్నాడిఎంకె నూతన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి మద్దతు తెలిపింది. ప్రణాళికలో సిఎఎకు వ్యతిరేకమని పేర్కొంది. మాజీముఖ్యమంత్రి జయలలిత బిజెపికి వ్యతిరేకం. కాని ఆమె మరణించిన వెంటనే అన్నాడిఎంకె నేతలు బిజెపితో పొత్తు కుదుర్చుకున్నార’ని విమర్శించారు.