రైతుల ఉద్యమాన్నిఉపసంహరించుకోలేదు 

రైతుల ఉద్యమాన్నిఉపసంహరించుకోలేదు 

రైతుల ఉద్యమాన్నిఉపసంహరించుకోలేదు

ఘాజీపూర్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో 383 రోజులపాటు నిరసన ఆదోళన చేపట్టిన రాకేష్ తికాయత్ బుధవారం ఘాజీపూర్ సరిహద్దు నుంచి నిష్ర్క మించారు.అంతకు ముందు విలేఖరులతో మాట్లాడారు. రైతుల ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశామే కాని పూర్తిగా ఉపసంహరించు కోలేదని రాకేష్ తికాయత్ తేల్చి చెప్పారు. స్వస్థలమైన సిసౌలీకి రానున్న రాకేష్ తికాయత్ కు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలకనున్నారు. రైతుల ఆందోళలనతో దిగివచ్చిన కేంద్రం మూడు చట్టాలను పార్లమెంటులో ఉపసంహరించుకుంది. రాకేష్ తికాయత్ బుధవారం మోడీనగర్, మీరట్, దౌరాలా టోల్ ప్లాజా, మన్సూర్పూర్ మీదుగా యూపీలోని ముజఫర్నగర్ జిల్లాలోని సిసౌలికి చేరుకుంటారు. తికాయత్ రాక సందర్భంగా సిసౌలీ ప్రజలు కిసాన్ భవన్ ను రంగురంగుల దీపాలతో అలంకరించి లడ్డూలు సిద్ధం చేశారు. రైతుల ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశామే కాని పూర్తిగా ఉపసంహరించుకోలేదని రాకేష్ తికాయత్ చెప్పారు.రైతులు నిరసన విరమించడంతో సింగు సరిహద్దు నుంచి కాంక్రీట్ అడ్డంకుకులను తొలగించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos