బెంగళూరు నగరంలోని యలహంక ఎయిర్‌బెస్‌లో నిర్వహిస్తున్న ఎయిర్‌షో ప్రదర్శన రిహార్సల్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది .యలహంక వేదికగా బుధవారం నుంచి 24వ తేదీ వరకు భారత వైమానిక దళం విమానాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.అందుకు సంబంధించి రెండు రోజులుగా వాయుసేన పైలట్లు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం కూడా ఐఏఎఫ్‌కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి.ఘటనలో వింగ్ కమాండర్ సహా ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్స్ తీవ్రంగా గాయపడ్డారు. అందుకుసంబంధి ఎయిర్ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది.ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ,స్క్వాడ్రన్ లీడర్స్ విజయ్ సల్కే,తేజేశ్వర్ సింగ్ లను కమెండో ఆసుపత్రిలో చేర్పించారు.నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. దానిపై స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటనలో వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతి చెందినట్లు అనధికారిక వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో మరమ్మత్తులు పూర్తి చేసిన అనంతరం మిరాజ్ యుద్ధ విమానాన్నిపరిశీలిస్తుండగా టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రహారీగోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందిన విషయం విదితమే..

