క్వారీలో ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి దుర్మరణం

క్వారీలో ట్రాక్టర్ బోల్తా :  ఇద్దరి దుర్మరణం

హోసూరు : ఇక్కడికి సమీపంలోని క్వారీలో ట్రాక్టర్ 50 అడుగుల లోతులో బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. హోసూరు సమీపంలోని వెంకటేశపురం గ్రామం వద్ద ప్రైవేట్ వ్యక్తికి చెందిన క్వారీలో డైనమేట్లు పెట్టేందుకు డ్రిల్లింగ్  చేసేందుకు వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి 50 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ ధర్మపురి జిల్లా ఇండూరుకు చెందిన వారని పోలీసుల విచారణలో తెలిసింది. బాగలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos