న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ పై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం దాడి చేసారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సహా పలువురు బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు తప్పుడు సమాచారంతో ఇటీవల చేసిన ట్వీట్లకు టిట్టర్ సంస్థ ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అనే ట్యాగ్ జత చేసి ఆ పోస్టులు నకిలీవని నిర్ధారించింది. బిజెపి బండారం బయటపడటంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాగ్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సమాచార, సాంకేతిక చట్టంలోని నిబంధనలు ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసేందుకు కేంద్రానికి అధికారం లేదనీ, ఇది కచ్చితంగా మాధ్యమాల్ని నియంత్రించటమేనని విమర్శలచ్చాయి. ట్విట్టర్ కూడా ఆ ట్యాగ్ లైన్ తొలగించకుండా తప్పుడు కథనాలు పోస్టు చేసిన మరికొందరి బిజెపి నేతల ట్వీట్లకు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అనే ట్యాగ్లైన జత చేసింది.దరిమిలా వారెంట్ కూడా ఇవ్వకుండానే పోలీసులు సోదాలు చేపట్టడం కచ్చితంగా కక్షసాధింపు చర్య ఐటి నిపుణులు వ్యాఖ్యానించారు.