ఫీజు కడితేనే ట్విట్టర్ వాడుకోగలరు

ఫీజు కడితేనే ట్విట్టర్ వాడుకోగలరు

వాషింగ్టన్: ట్విట్టర్ లో సంస్కరణలు ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయానికి తెరతీయనున్నారు. ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదనతో ఉన్నారు. నకిలీ ఖాతాలను ఏరిపారేయడమే దీని వెనుక ఉద్దేశ్యంగా ఉంది. ట్విట్టర్ కు 55 కోట్ల యూజర్లు ఉన్నారని, ప్రతి రోజూ 10-20 కోట్ల పోస్ట్ లను పెడుతుంటారని మస్క్ స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు తెలియజేయడం గమనార్హం. కాకపోతే ఇందులో బాట్స్ రూపంలో పనిచేస్తున్న నకిలీ ఖాతాలు ఎన్ని? మనుషులే నిజంగా ఉపయోగించేవి ఎన్ని? అన్న దానిపై మస్క్ కు సైతం స్పష్టత లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos