ప్యాంట్‌ ధరించకుండా మోదీపై హీరో భార్య సెటైర్‌..

ప్యాంట్‌ ధరించకుండా మోదీపై హీరో భార్య సెటైర్‌..

అవకాశం దొరికిన ప్రతీసారి ప్రధాని నరేంద్రమోదీపై సెటైర్లు వేసే బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా మరోసారి ప్రధాని మోదీపై సెటైర్‌ వేసింది.ఇటీవల కేదారనాథ్‌ పర్యటనకు వెళ్లిన మోదీ పర్యటన సమయంలో గుహలో యోగతా చేస్తున్న ఫోటోలు సామాజిరక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.దీనిపై సానుకూలంగా స్పందించే వారితో సమానంగా సెటైర్లు వేస్తున్న నెటిజన్ల సంఖ్య కూడా ఉంటోంది.ఈ క్రమంలో ట్వింకిల్‌ ఖన్నా కూడా కాషాయం రంగులో ఉన్న ఒక బొమ్మ దాని పక్కన ప్యాంట్ లేకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది.ఫోటోతో పాటు.. ”ఇటీవల నేను ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలను కొన్నింటిని చూశాను. వాటి ప్రేరణతో నేను కూడా మెడిటేషన్ ఫోటోగ్రఫీకి చెందిన వర్క్ షాప్ ను ప్రారంభిస్తున్నాను. ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంటే సూపర్” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది.ట్వింకిల్ తన ట్వీట్ లో ఎక్కడా.. మోదీ పేరు ప్రస్తావించనప్పటికీ ఆమె ట్వీట్ అర్ధం చేసుకున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.అయినా ఒకరిని విమర్శించే ముందు విమర్శించే అర్హత,స్థాయి మనకు ఉందా లేదా అని కూడా చూసుకోకుండా ప్రధానమంత్రిపై ఇటువంటి చీప్‌ సెటైర్లు ఏంటో.ఉన్నతహోదాలో ఉన్న ప్రధానమంత్రిపై ఇటువంటి చీప్‌ సెటైర్లు వేస్తూ సెలబ్రిటీలుగా, మేధావులుగా భావించుకుంటూ వీళ్లంతా సమాజానికి,యువతకు ఏం సందేశం ఇస్తున్నారో.మీరు కూడా మాలానే పెద్దచిన్నా తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు సెటైర్లు వేయమని సలహాలు ఇస్తున్నారా??

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos