తెలుగు రాష్ట్రాల్లో యూకే డిప్యూటీ హై కమిషనర్‌గా పనిచేస్తున్న ఆండ్ర్యూ ఫ్లెమింగ్ తెరాస కార్యాధ్యక్షుడు కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.అందుకు కారణం ఫ్లెమింగ్ తెలుగులో ట్వీట్ చేయడమే.”త్వరలో కేటీఆర్ గారిని యూకే తీసుకు వెళ్ళగలనని ఆశిస్తున్నా. అక్కడ బ్రిటిష్ వ్యాపారవేత్తలకు కూడా తెలంగాణ వ్యాపార విధానాలను వివరిస్తారని కోరుకుంటున్నా” అని ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్కు ఇటీవల ఐఎస్ఐఎస్ అధికారులతో సమావేశమైన కేటీఆర్‌కు చెందిన వార్త క్లిప్‌ను జోడించారు.
త్వరలో @KTRTRS గారిని యూకే తీసుకువెళ్ళగలనని ఆశిస్తున్నా. అక్కడ బ్రిటిష్ వ్యాపారవేత్తలకు కూడా తెలంగాణ వ్యాపార విధానాలను వివరిస్తారని కోరుకుంటున్న pic.twitter.com/6gttCY3N6F
— Dr Andrew Fleming (@Andrew007Uk) November 6, 2019